అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-19T05:23:48+05:30 IST

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికా రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు.

అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 18: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికా రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం అన్ని మండలస్థాయి సమావేశాలను ప్రత్యేక అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి ప రిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. ప్రతీ నివాస ప్రాంతంలో పారిశు ధ్య పనులు, మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని, ఎక్కడైనా పైప్‌లైన్‌ లీకేజీ జరిగితే వెంటనే సరిచేయాలని సూచించారు. ఒక్కోట్యాంకు వారీగా ట్యాంకులను శుభ్రం చేయించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. సీజనల్‌ వ్యా ధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమ హాస్టల్స్‌, రెసిడెన్షియల్‌ స్కూళ్ల విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా వారిని బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దన్నారు. జిల్లాలో 557 విద్యుత్‌ స్తంభాలు, 109 ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నాయని వీటిని వెంటనే రిపేర్‌ చేయించి విద్యుత్‌ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్‌లకు సంబంధించి దెబ్బతిన్న వి ద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మతులు రెండు, మూడు రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కాల్వల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్‌, పలు శా ఖల అధికారులు పాల్గొన్నారు.

Read more