నూతన కలెక్టరేట్‌కు కార్యాలయాలు..

ABN , First Publish Date - 2022-09-08T06:39:05+05:30 IST

సోమవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జిల్లాకేంద్రంలో ప్రారంభమైన నూతన సమీకృత కలెక్టరేట్‌లో బుధవా రం కలెక్టర్‌ నారాయణరెడ్డి తన విధుల ను ప్రారంభించారు. మంగళవారం అదనపు కలెక్టర్‌లు విధులను ప్రారంబించగా.. పలు శాఖల అధికారులు బుధవారం తమ కార్యాలయాలను నూతన కలెక్టరేట్‌కు మార్చారు. పాత కలెక్టరేట్‌లోని పలు కార్యాలయాలు, నూతన కలెక్టరేట్‌లో కేటాయించిన

నూతన కలెక్టరేట్‌కు కార్యాలయాలు..

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 7: సోమవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జిల్లాకేంద్రంలో ప్రారంభమైన నూతన సమీకృత కలెక్టరేట్‌లో బుధవా రం కలెక్టర్‌ నారాయణరెడ్డి తన విధుల ను ప్రారంభించారు. మంగళవారం అదనపు కలెక్టర్‌లు విధులను ప్రారంబించగా.. పలు శాఖల అధికారులు బుధవారం తమ కార్యాలయాలను నూతన కలెక్టరేట్‌కు మార్చారు. పాత కలెక్టరేట్‌లోని పలు కార్యాలయాలు, నూతన కలెక్టరేట్‌లో కేటాయించిన పలు శాఖలు కొత్త కలెక్టరేట్‌కు సామగ్రిని తరలించారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అన్ని కార్యాలయాలు నూతన కలెక్టరేట్‌కు తరలించేందుకు అదికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి నూతన కలెక్టరేట్‌ నుంచి బుధవారం వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు శాఖలపై సమీక్షించారు. 

Read more