CM KCRపై ఎంపీ ధర్మపురి Arvind ఫైర్

ABN , First Publish Date - 2022-07-13T20:34:29+05:30 IST

సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

CM KCRపై ఎంపీ ధర్మపురి Arvind ఫైర్

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్‌ (CM KCR)పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ (PM Modi), బీజేపీ (BJP)పై సీఎం చేసిన కామెంట్స్‌కు దీటుగా జవాబు ఇచ్చారు. మజీద్‌పై వ్యాఖ్యలు చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. హిందువులంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చులకనభావంగా ఉందని, హిందువులు ఇప్పిటికైనా కళ్ళు తెరవాలని సూచించారు.


సీఎం సొల్లు కబుర్లు ఆపి వర్షాలపై సమీక్షలు చేయాలని అర్వింద్ అన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారని విమర్శించారు. వరదలతో ఉత్తర తెలంగాణలో గ్రామాలు తుడిచిపెట్టుకుపోతుంటే.. ముఖ్యమంత్రి సమీక్షలు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని గతంలో కేసీఆర్ పొగడలేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.

Read more