ఎల్లారెడ్డి ప్రజలకు ఎమ్మెల్యే వెన్నుపోటు

ABN , First Publish Date - 2022-10-11T05:48:28+05:30 IST

ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌ గెలువవద్దని ప్రజలు చందాలు వేసుకొని మరీ ఎమ్మెల్యేగా సురేందర్‌ను గెలిపిస్తే, ఆ ప్రజలకే వె న్నుపోటు పొడిచి టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. షర్మి ల చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర సోమవారం లింగం పేట మండలం కొయ్యగుండు తండా నుంచి ఎల్లారెడ్డి మండలం హజీపూర్‌ తండాకు చేరుకుంది.

ఎల్లారెడ్డి ప్రజలకు ఎమ్మెల్యే వెన్నుపోటు

మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల


ఈ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నట్లు.. రాజీనామా చేయాలి

కేసీఆర్‌ లాంటి పెద్దకొడుకు ఎవరికీ ఉండవద్దు 

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 20 వేల ఎకరాలకు నీరందించిన వైఎస్సార్‌ 

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

2508 కి.మీ.లు చేరుకున్న పాదయాత్ర 

వర్షంలోనూ కొనసాగిన పాదయాత్ర

ఎల్లారెడ్డి/ లింగంపేట, అక్టోబరు 10: ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌ గెలువవద్దని ప్రజలు చందాలు వేసుకొని మరీ ఎమ్మెల్యేగా సురేందర్‌ను గెలిపిస్తే, ఆ ప్రజలకే వె న్నుపోటు పొడిచి టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. షర్మి ల చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర సోమవారం లింగం పేట మండలం కొయ్యగుండు తండా నుంచి ఎల్లారెడ్డి మండలం హజీపూర్‌ తండాకు  చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవని ఎమ్మెల్యే సురేందర్‌ సీఎం కేసీఆర్‌ చెప్పు కింద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని చెప్పిన ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సొం త గ్రామంలో పోడు పట్టాలకోసం పోరాడుతున్న రైతులపై అటవీశాఖ అధికారులు దాడులుచేస్తే పట్టించుకోలేదన్నారు. స్థానిక వెల్ఫేర్‌ హాస్టల్‌లో విద్యార్థులను ఎలు కలు కరిస్తే కనీసం వైద్యం కూడా చేయించలేదని, నాగిరెడ్డిపేటలో వీఆర్‌ఏ ఆత్మహత్య చేసుకుంటే మృతుడి ఇంటికి కూడా వెళ్లలేకపోయాడని, ఈ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

కేసీఆర్‌లాంటి పెద్దకొడుకు ఎవరికీ ఉండొద్దు 

కేసీఆర్‌ లాంటి పెద్దకొడుకు ఎవరికీ ఉండవద్దని వై ఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పెద్ద కొడు కు అంటే తల్లిని తండ్రిని సమానంగా చూడాలని, కానీ పింఛన్‌ తండ్రికి ఇస్తే తల్లికి ఇవ్వరని, తల్లికిస్తే తండ్రికి ఇవ్వరని ఇలాంటి పెద్దకొడుకు తల్లిదండ్రులకు కష్టాలే తప్పా సుఖం ఉండదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ ఎస్‌ నా యకులు భూకబ్జాలు పాల్పడేందుకే ధరణి తీసు కువ చ్చారని, తహసీల్దార్‌తో పరిష్కారమయ్యే సమస్య లు కలెక్టర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో సామా న్యుల సమస్యలు పరిష్కారం కాక సంవత్సరాలుగా కార్యాల యాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఉద్యో గులు సరియైన సమయంలో జీతాలు రాక ఇబ్బం దు లు పడుతున్నారన్నారు. బంగారు తెలంగాణలో జీతా లు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆమె తెలిపారు.రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20వేల ఉ ద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. మహిళలకు జీ రో వడ్డీకి రుణాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 15లక్షల మంది విద్యార్థులు రూ. 35వేల ఫీజురీయిం బర్స్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.  తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు కేసీఆర్‌ను ప్రశ్నించడం లేదన్నారు. 

నిరుద్యోగుల కోసం మొదటి సంతకం..

వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేదలకు అందించేందుకే వైఎస్‌ఆర్‌ పార్టీని పెట్టానని, అధికారంలోకి రాగానే మొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగుల కోసం పెడతానని షర్మిల అన్నా రు. ప్రతీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వృద్ధు లకు, వికలాంగులకు రూ.3వేలకు తగ్గకుండా పెన్షన్‌లు ఇస్తానని తెలిపారు. పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని, బెల్టు షాపులు మూసివేస్తానని హామీ ఇచ్చారు. 

20 వేల ఎకరాలకు నీరందించిన వైఎస్సార్‌

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గతంలో నాలుగురోజుల పాటు పా దయాత్ర చేశారని, ఆ రోజుల్లో సాగునీరు అందడం లేదని రైతులు వైఎస్‌ఆర్‌ దృష్టికి తీసుకువచ్చారన్నారు. పోచారం ప్రాజెక్టు కాలువను మరమ్మతులు చేస్తే నీళ్లు వస్తాయని వైఎస్‌ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఇచ్చిన మాటకు అధికారంలోకి వచ్చాక మరమ్మతులు చేసి 20 వేల ఎకరాలకు నీరు అందించారన్నారు. డిగ్రీ కళాశాలను మోడల్‌ రెసిడెన్సీ కళాశాలగా మార్చారన్నారు. గాంధారి, పొతంగల్‌ బ్రిడ్జిలను కట్టించారని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌తో ఎల్లారెడ్డి ని యోజకవర్గానికి 90 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల ని అనుకున్నారని తెలిపారు. భూంపల్లి రిజర్వాయర్‌ను 70 శాతం పనులు పూర్తిచేశారని తెలిపారు. కానీ కేసీఆర్‌ ఆ ప్రాజెక్టు డిజైన్‌ మార్చి ఎల్లారెడ్డి ప్రజలకు, రైతులకు అన్యాయంచేశారని మండిపడ్డారు. 78 రోజులుగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తుంటే కనీసం కనికరం చూపడం లేదంటూ మండి పడ్డారు. పోలీసులను పనివాళ్లలా ఉపయోగించుకుంటూ సొంత సైన్యంలా వాడుకుంటున్నాడని ఆరోపించారు. పోలీసులు ఖాకీ చొక్కలు తీసి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకుంటే సరిపోతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుచెప్పి కేసీఆర్‌ రూ.70 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేకపోయారన్నారు. అవినీతికి పాల్పడి కాజేసిన డబ్బులతోనే కేసీఆర్‌ సొంత విమానం కొంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అంటే బందిపోట్ల రాజ్యసమితి అని అన్నారు. రాజకీయ ఒత్తిడితోనే విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం లేదని తాలిబన్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ప్రజల మనోభావాలకు తెలంగాణలో వి లువలేదన్నారు. ఒక మాజీ సీఎం విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ వైఎస్‌ఆర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఎప్పటికైనా హజీపూర్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహం పెడతానని షర్మిల అన్నారు.

ప్రజల ప్రేమ అభిమానాలతోనే పాదయాత్ర : వైఎస్‌ విజయమ్మ

తెలంగాణ ప్రజల ప్రేమ అభిమానాలతోనే వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్రతో 2500 కి.మీ.ల మైలు రాయిని పూర్తిచేసుకుందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగసభకు విజయమ్మ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సహకారంతోనే షర్మిల ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకోసం షర్మిల పాదయాత్ర చే యడం, కష్టపడుతుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని అన్నారు. 19 ఏళ్ల క్రితం వైఎస్‌ఆర్‌ చేసిన ప్రజాప్రస్థానం ఓ చరిత్ర సృష్టించిందన్నారు. వైఎస్‌ఆర్‌ చేసిన ప్రతీ అడుగు ప్రజా సంక్షేమానికి పరుగులు తీసిందన్నారు. సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమన్యాయం కోసమే వైఎస్‌ఆర్‌ టీపీ పుట్టిందన్నారు. వైఎస్‌ఆర్‌ పాలన ప్రజలు కోరుకుంటే ఆయన బిడ్డ షర్మిలను ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు.

2500 కి.మీ.లకు చేరిన షర్మిల పాదయాత్ర

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపడుతున్న ప్రజాప్రస్థాన యాత్ర కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హజీపూర్‌ తండా వరకు 2508 కి.మీలకు చేరుకుంది. సోమవారం లింగంపేట మండలం కోయగుట్ట తండా నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఎల్లారెడ్డి మండలంహజీపూర్‌ తండాకు 2500 కి.మీ.ల మైలురాయిని ప్రజాప్రస్థానపాదయాత్ర చేరుకుంది. తెలంగాణలో సుమారు 175 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర 47 నియోజకవర్గాల్లోని 140 మండలాలు, 41 మున్సిపాలిటీల్లో, 2 కార్పొరేషన్‌లలో, 1287 గ్రామాలమీదుగా పాదయాత్ర సాగింది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చేరుకుంది. జిల్లాలో భారీ వర్షాన్ని లెక్కచేయకుండా పాదయాత్ర కొనసాగుతూ వచ్చారు. ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్‌ తండా వద్ద దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్థానిక పార్టీ నాయకులు నిర్ణయించారు.దీంతో స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విగ్రహాన్ని ఏర్పాటుచేయనివ్వకుండా అక్కడి నుంచి తీసుకెళ్లారు.సంఘటన స్థలానికి షర్మిల చేరుకుని వైఎస్‌ఆర్‌ తాత్కాలిక విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

Read more