విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-31T05:43:08+05:30 IST

బోధన్‌లోని రాకాసిపేట్‌లో కరెంట్‌ స్తంభంపై విద్యుత్‌ మరమ్మతుల నిమిత్తం ఎక్కిన మున్సిపల్‌ కాంట్రాక్టు లైన్‌మెన్‌ సంతోష్‌ (25) స్తంభంపైనే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు సంతోష్‌ వర్ని మండలం సైదాపూర్‌ తం డా గ్రామానికి చెందిన వాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

బోధన్‌ రూరల్‌, ఆగస్టు 30: బోధన్‌లోని రాకాసిపేట్‌లో కరెంట్‌ స్తంభంపై విద్యుత్‌ మరమ్మతుల నిమిత్తం ఎక్కిన మున్సిపల్‌ కాంట్రాక్టు లైన్‌మెన్‌ సంతోష్‌ (25) స్తంభంపైనే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు సంతోష్‌ వర్ని మండలం సైదాపూర్‌ తం డా గ్రామానికి చెందిన వాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విద్యుత్‌ మరమ్మతుల నిమిత్తం ఎల్‌సీ తీసుకుని స్తంభం ఎక్కాడని, పనులు పూర్తి కాకముందే కరెంట్‌ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని అన్నారు. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం, ట్రాన్స్‌కో అధికారులు ఆదుకోవాలని బోధన్‌ ఆసుపత్రి ఎదుట మృతదేహం మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతునికి ఎనిమిది నెలల క్రితం వివాహామైందని, భార్య గర్భవతి అని, కుటుంబాన్నిఆదుకునేది ఎవరని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ ని సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

Read more