రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2022-09-22T05:19:18+05:30 IST

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా జట్లను జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బు ధవారం ఎంపికలు నిర్వహించారు. కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్‌లో ఉదయం నుంచి ఈ పోటీలు కొనసాగాయి. సుమారు 50 మందికి పైగా హాజరయ్యారు. ఇందులో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను ఈ నెల 24, 25వ తే దీల్లో కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో జిల్లా కార్యదర్శి భూలోకం విజయ్‌కాంత్‌రావు, ఉ పాధ్యక్షుడు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, సూర్యప్రకాష్‌, నరేష్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 21: రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా జట్లను జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బు ధవారం ఎంపికలు నిర్వహించారు. కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్‌లో ఉదయం నుంచి ఈ పోటీలు కొనసాగాయి. సుమారు 50 మందికి పైగా హాజరయ్యారు. ఇందులో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను ఈ నెల 24, 25వ తే దీల్లో కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో జిల్లా కార్యదర్శి భూలోకం విజయ్‌కాంత్‌రావు, ఉ పాధ్యక్షుడు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, సూర్యప్రకాష్‌, నరేష్‌ పాల్గొన్నారు.

పురుషుల విభాగంలో..

కే.యశ్వంత్‌కుమార్‌, సాయితేజ, అండర్‌14 బాలుర విభాగంలో షేక్‌ ముఖిత్‌, తేజాస్‌, అండర్‌-16 బాలుర విభాగంలో షేక్‌గౌస్‌, అండర్‌-18 బాలుర విభాగంలో రాఘవేందర్‌, సమిత్‌, రితికేష్‌, బాలికల అండర్‌-18లో శ్రీముఖి, మహిళల విభాగంలో శిల్పాచౌహాన్‌లు ఎంపికయ్యారు.


Read more