శక్తి ఉన్నంత వరకూ రాజకీయాల్లో ఉంటా

ABN , First Publish Date - 2022-07-05T06:12:30+05:30 IST

శక్తి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని శక్తి కోల్పోయినప్పుడు స్వచ్ఛందంగా తప్పుకుంటానని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

శక్తి ఉన్నంత వరకూ రాజకీయాల్లో ఉంటా

పట్టుదల, సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చు

అందరూ ఉద్యోగాలు సాధించి రాష్ట్రంలో

బాన్సువాడ పేరును నిలపాలి.. 

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

బాన్సువాడ, జూలై 4 : శక్తి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని శక్తి కోల్పోయినప్పుడు స్వచ్ఛందంగా తప్పుకుంటానని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని భారత్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కోచింగ్‌ సెంటర్‌లో ఉచిత మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బాన్సువాడ కోచిం గ్‌ సెంటర్‌, వర్ని కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందిన అభ్యర్థులకు స్పీకర్‌ పోచారం స్టడీ మెటీరియల్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద యువతీ యువకులకు సేవ చేయాలనే ఆలోచనతో అన్నీ తానై ఉచితంగా కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డికి అభినందనలు తెలి పారు. సేవాభావంతో వ్యక్తిగతంగా తన సొంత ఖర్చులతో కోచింగ్‌తో పా టు భోజనం సదుపాయం కల్పించి ఉచితంగా మెటీరియల్‌ పంపిణీ చేయడం ఎంతో గర్వకారణమన్నారు. గత 70 రోజులుగా కోచింగ్‌ తీసు కున్న అభ్యర్థులు కష్టపడి చదివితే 70 ఏళ్ల జీవితానికి మలుపు తిప్పిన వారవుతారన్నారు. పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. అవకాశం మాటిమాటికి రాదని వచ్చినప్పుడే ఉపయోగించుకో వాలన్నారు. కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులందరూ ఉద్యోగాలు సాధించి రాష్ట్రంలోనే పేరు నిలబెట్టాలన్నారు. శాఖల వారీగా ఖాళీలను లెక్కగట్టి మరో 91,116 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 16లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం మాదిరిగా దేశంలోనే అన్ని రాష్ర్టాలు, కేంద్ర ఉద్యోగాలను భర్తీ చేస్తే 50లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, కలెక్టర్‌ జితేష్‌.వి.పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, నిజామాబాద్‌ సీపీ నాగరాజు, ఆర్డీవో రాజాగౌడ్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ ప్రతినిధి జనార్ధన్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌ ఆత్మ కమిటీ మండలాధ్యక్షుడు మోహన్‌ నాయక్‌,  నాయకులు వెంకట్‌రాం రెడ్డి, ఎజాజ్‌, గోపాల్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కోచింగ్‌ అభ్యర్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:12:30+05:30 IST