ధాన్యం మిల్లింగ్‌ను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-11T05:48:50+05:30 IST

ధాన్యం మిల్లింగ్‌ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో రైస్‌మిల్లు యాజమానులతో ధాన్యం మిల్లింగ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ధాన్యం మిల్లింగ్‌ను వేగవంతం చేయాలి

కామారెడ్డి,అక్టోబరు 10: ధాన్యం మిల్లింగ్‌ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో రైస్‌మిల్లు యాజమానులతో ధాన్యం మిల్లింగ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్‌మిల్లు యాజమానులు రోజూవారీ లక్ష్యాలను పూర్తిచేయాలని తెలిపారు. రోజుకు 464 మెట్రిక్‌ టన్నుల ధాన్యంమిల్లింగ్‌ చేయాలని సూచించారు. నెలరోజుల్లో లక్ష్యాన్ని అధిగమించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఇన్‌చార్జి డీఎం వెంకటేశ్వరరావు, సివిల్‌ సప్లయ్‌ అధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more