విధులకు ఎగనామం!
ABN , First Publish Date - 2022-09-08T06:35:06+05:30 IST
వేలల్లో వేతనాలు పొందుతూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ ఉపాఽధ్యాయులు.. విధులకు ఎగనామం పెడుతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడం శరామామూలే అయినా.. జిల్లాకేంద్రంలోని హమాల్వాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తు న్న ఇద్దరు ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా సెలవు పెట్టడంతో పాఠశాలకు

బడికి రాని టీచర్లు.. ప్రభుత్వ పాఠశాలకు తాళం
జిల్లాకేంద్రంలోనే ఘటన
విద్యాశాఖ అధికారులకు సమాచారం కరువు!!
నిజామాబాద్ అర్బన్, సెప్టెంబరు 7: వేలల్లో వేతనాలు పొందుతూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ ఉపాఽధ్యాయులు.. విధులకు ఎగనామం పెడుతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడం శరామామూలే అయినా.. జిల్లాకేంద్రంలోని హమాల్వాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తు న్న ఇద్దరు ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా సెలవు పెట్టడంతో పాఠశాలకు తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఈ ఘటన జరగడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణంలోనే ఆడుకుంటూ హైస్కూల్ ప్రాంగణంలో మధ్యాహ్న భోజనం చేయాల్సి వచ్చింది. నగరంలోని హమాల్వాడి ప్రాథమిక పాఠశాలలో ప్రవీన్, అరుణజ్యోతి, ప్రమిళలు పనిచేస్తుండగా.. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రమిళను పక్కనే ఉన్న హైస్కూల్‌కు డిప్యూటేషన్ వేశారు. నిత్యం ప్రవీన్, అరుణజ్యోతిలు విధులు నిర్వహించాల్సి ఉండగా.. వారు విధులకు హాజరుకాలేదు. ఇద్దరు ఉపాధ్యాయులు ఒకేరోజు సెలవు లో ఉండడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్ప డింది. ఇద్దరు ఉపాద్యాయులు ఒకేరోజు సెలవుపెట్టే పరిస్థితి ఉంటే కాంప్లెక్స్ హెచ్ ఎంకు లేదా ఎంఈవోకు సమాచారం ఇస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు ఉపాధ్యాయులు కాంప్లెక్స్ హెచ్ఎంకు, ఎంఈవోకు సెలవు విషయమై సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థులు వరండాలో ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం వరకు విద్యార్థులు హైస్కూల్ ప్రాంగణంలోనే ఉండగా, హైస్కూల్ ఉపాద్యాయులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. సమాచారం లేకుండా సెలవుపై వెళ్లిన ఉపాధ్యాయులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది..!!