పాల ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-08-31T06:17:28+05:30 IST

రైతులు వ్యవసాయంతో పాటు పాల ఉత్ప త్తిపై దృష్టి సారిస్తే ఎంతో ప్రయోజ నకరంగా ఉంటుందని, ఆర్థికంగా కూడా ఎంతో తోడ్పాటు ఉంటుందని కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ అన్నారు.

పాల ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించాలి

జుక్కల్‌, ఆగస్టు 30 : రైతులు వ్యవసాయంతో పాటు పాల ఉత్ప త్తిపై దృష్టి సారిస్తే ఎంతో ప్రయోజ నకరంగా ఉంటుందని, ఆర్థికంగా కూడా ఎంతో తోడ్పాటు ఉంటుందని కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ జుక్కల్‌ మం డలంలోని ఆయా గ్రామాలను సం దర్శించారు. మహ్మదాబాద్‌, కౌలాస్‌, దోస్‌పల్లి, జుక్కల్‌లలో ప్రభుత్వ పాఠశాలలు, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని, కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రాన్ని, ఆడిటోరియం భవనం, గ్రామ పంచాయతీ భవనం, తదితర విషయాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని విజయ డెయిరీమిల్క్‌ సెంటర్‌ను సందర్శించారు. విజయ డెయిరీ పాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు పాల ఉత్పత్తిపై అవగాహన కల్పించాలని పశు వైద్యాధికారి పండరీ నాథ్‌కు సూచించారు. పాల ఉత్పత్తి పెర గకుంటే కామారెడ్డికి డెయిరీని తరలించడం జరు గుతుం దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసులో టైం టేబుల్‌, కంప్యూటర్‌ క్లాసులు తదితర వాటిపె ఉపాఽధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగై న వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్య క్రమంలో ఆర్డీవో రాజాగౌడ్‌, ఎంపీపీ యశోద నీలు పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ సాయాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మాధవ్‌రావు దేశాయి, బొల్లి గంగాధర్‌, సర్పంచ్‌ రాములు, కపిల్‌ పటేల్‌, రవి శంకర్‌, ఎంపీడీవో రవీశ్వర్‌ గౌడ్‌, యాదగిరి, గణేష్‌, శివానంద్‌ తదితరులున్నారు. 

Read more