పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలి

ABN , First Publish Date - 2022-12-10T00:36:07+05:30 IST

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 9: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. శుక్రవారం దేవునిపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు 20లోపు పాఠశాలలో పనులను పూర్తి చేయాలని సూచించారు. మరమ్మతు పనులు, పారిశుధ్యం, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజు, ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్‌, ఎంఈవో ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్‌ లేకుండా ఆహార పదార్థాల విక్రయాలు చేయొద్దు

లైసెన్స్‌ లేకుండా ఆహార పదార్థాల విక్రయాలు చేస్తే రూ.5లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆధ్వర్యంలో తినుబండారాలు విక్రయించే వ్యాపారులకు లైసెన్స్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైసెన్స్‌ పొందిన వ్యాపారులు నాణ్యమైన ఆహారపదార్ధాలు విక్రయించాలని తెలిపారు. కల్తీ లేకుండా వ్యాపారులు తినుబండారాలు తయారు చేసి విక్రయించాలని కోరారు. ఏడాదికి ఒకసారి లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:36:08+05:30 IST