ఉపాధి పేరిట ఏజెట్ల దోపిడీ

ABN , First Publish Date - 2022-12-10T01:46:46+05:30 IST

దేశాలకు వెళితే ఉపాధితోపాటు జీతం కూడా అధికంగా వస్తుందన్న ఆశతో రూ.లక్షలు చెల్లించి వెళ్తున్న జిల్లా యు వతను ఏజెంట్లు నిలువునా దోచేస్తున్నారు. ఇప్పటికే ఈ కోవలో అనేక మోసాలు వెలుగు చూడగా.. తాజాగా విజి ట్‌ వీసాపై మలేషియాకు వెళ్లిన జిల్లాకు చెందిన 50మంది అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్నారు.

ఉపాధి పేరిట ఏజెట్ల దోపిడీ

విజిట్‌ వీసాలపై మలేషియాకు పంపిన ఏజెంట్లు

50 మందికి పైగా ఉపాధి కోసం వెళ్లిన జిల్లావాసులు

ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసిన మలేషియా అధికారులు

పది రోజులుగా అష్టకష్టాలు పడుతున్న యువకులు

సర్కారు పట్టించుకోవాలని బాధితుల వేడుకోలు

నిజామాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విదేశాలకు వెళితే ఉపాధితోపాటు జీతం కూడా అధికంగా వస్తుందన్న ఆశతో రూ.లక్షలు చెల్లించి వెళ్తున్న జిల్లా యు వతను ఏజెంట్లు నిలువునా దోచేస్తున్నారు. ఇప్పటికే ఈ కోవలో అనేక మోసాలు వెలుగు చూడగా.. తాజాగా విజి ట్‌ వీసాపై మలేషియాకు వెళ్లిన జిల్లాకు చెందిన 50మంది అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్నారు. ఏజెంట్లను నమ్మి.. సరైన పత్రాలు లేకుండా విజిట్‌ వీసాపై వెళ్లినవారిని అక్క డి అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంతో.. వారు నానా అవస్థలు పడుతున్నారు. తమను స్వదేశానికి రప్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

ఫ 10 రోజులుగా మలేషియా ఎయిర్‌పోర్టులోనే..

ఉపాధి కోసం మలేషియాకు వెళ్లిన వారిని అక్కడి అధి కారులు ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. విజిట్‌ వీసాపై నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని నిలిపివేయడంతో కౌలలాంపూర్‌లోని ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడుతున్నారు. తమను స్వదేశానికి తిప్పి పంపాలని అక్కడి ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని వారి కుటుంబ సభ్యులకు వివరాలు అందించడంతో పాటు తమ ను అక్కడ నుంచి దేశానికి వచ్చేవిధంగా చూడా లని కోరుతున్నారు. కానీ అక్కడి ఎంబసీ అధికారులు ఇంకా స్పందించకపోవడంతో జిల్లాకు చెందిన ఎంపీ అర్వింద్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమను ఎలాగైనా ఇక్కడి నుంచి తిరిగి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఫ 50మందికి పైగా జిల్లా వాసులు

జిల్లాకు చెందిన సుమారు 50మందికి పైగా యువకు లు గత నెల 28న ఏజెంట్లు ఇచ్చిన విజిట్‌ వీసాపై మలేషియాకు వెళ్లారు. ఒక్కొక్కరు లక్ష నుంచి లక్షన్నర వరకు డబ్బులు చెల్లించారు. విజిట్‌ వీసాపై వెళ్లిన వారికి అక్కడ ఉపాధి కల్పిస్తామని ఏజెంట్లు నమ్మించడంతో వారు డబ్బు లు వెచ్చించి అక్కడికి వెళ్లారు. జిల్లా నుంచి అన్ని మండలా ల పరిధిలోని వారు వివిధ విమానాల ద్వారా గత నెల 20 నుంచి 30వ తేదీ మధ్య చేరుకున్నారు. అయితే ఎ క్కువ మంది విజిట్‌ వీసాపైనే మలేషియాకు రావడంతో అక్కడి అధికారులకు అను మానం వచ్చి ఆరా తీశారు. విషయం తెలుసుకొ ని వీరందరినీ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. జిల్లా తో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు అక్కడ 1350కి పైగా మంది ఉన్నట్లు జిల్లా వాసులు తెలిపారు. అక్కడ ఉంచిన వారిని బయటకు పంపించకపోవడం, తిరిగి స్వదేశానికి కూడా పంపకపోవడంతో ఇబ్బ ందులు పడుతున్నారు. తమను పంపిన ఏజెంట్లకు ఫోన్‌ లు చేస్తే సరిగా స్పందించకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందిం చారు. వారితో పాటు తమ కు తెలిసిన బంధువులకు, ప్రజాప్రతినిధులకు వివరాలు ఇవ్వడంతో పాటు మలేషియాలోని ఇండియన్‌ ఎంబసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులైనా అక్కడి అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో పది రోజుల తర్వాత జిల్లా ఎంపీ అర్వింద్‌ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తమను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

ఫ ఏటా జిల్లా నుంచి వేలాది మంది..

జిల్లా నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. కానీ కొందరు ఏజెంట్లు చేస్తున్న మోసాలవల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉద్యోగాలు ఉండి అక్కడి కంపెనీల ఆమోదంతో వెళ్లి నవారు ఇబ్బందులు లేకుండా పనిచేస్తుండ గా.. విజిట్‌ వీసా మీద వెళ్లిన వారికి తిప్పలు తప్పడంలే దు. జిల్లాలో ఈ ఏజెంట్లకు సంబంధించిన మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా.. చర్యలు ఉండడం లేదు. దీంతో ప్రతీ యేడు వందల సంఖ్యలో ఏజెంట్ల మోసాల వల్ల పలువురు నష్టపోతున్నారు. జిల్లా అధికారులు ఇక్కడి ఏజెంట్లను కట్టడిచేసి.. విదేశాల్లో ఉద్యోగాలను పరిశీలించి న తర్వాత పంపితే.. యువత నష్టపో యే అవకాశం ఉండదు.

అధికారులతో మాట్లాడిన ఎంపీ అర్వింద్‌

మలేషియాలో చిక్కుకున్న జిల్లావాసులు విషయాన్ని ఫోన్‌లో ఎంపీ అర్వింద్‌ దృష్టికి తీసుకురావడంతో.. ఆయన విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడారు. మలేషియాలో చిక్కుకున్న జిల్లా వాసులతో పాటు ఇతరులనూ స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్య లు తీసుకోవాలని కోరారు. అక్కడ చిక్కుకున్న వారితో కూడా ఆయన మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు వారికి తెలిపారు.

రూ.80వేలు తీసుకుని పంపించాడు..

ఫ గంగాధర్‌, నాడాపూర్‌

కామారెడ్డికి చెందిన ఏజెంటుకు 80వేల రూపాయలను ఇచ్చాను. మలేషియాలో ఉద్యోగం ఉందని చెప్పి పంపించాడు. ఎయిర్‌పోర్టులో అధికారులకు స మాచారం ఇచ్చినా.. మమ్మల్ని పట్టించుకోవడంలేదు. ఎలాగైనా స్వదేశానికి వచ్చేవిధంగా చూడాలి. జిల్లా ఎంపీతో పాటు ప్రభుత్వాలు పట్టించుకొని ఇండియ న్‌ ఎంబసీ అధికారులకు మా వివరాలు అందించాలి. మమ్మల్ని వెంటనే ఇండియాకు రప్పించాలి.

Updated Date - 2022-12-10T01:46:47+05:30 IST