జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-10-18T05:39:26+05:30 IST

జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు.

జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు


కామారెడ్డి,అక్టోబరు 17: జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 6.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుచేయానికి గన్నిబ్యాగులు, తేమశాతం పరిశీలించే యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ఽధాన్యానికి రూ.2060, సాధారణ రకానికి రూ.2040 నిర్ణయించిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేస్తామని తెలిపారు. సహకార సంఘం ఆధ్వర్యంలో 55, ఐకేపీ ఆధ్వర్యంలో 20 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Read more