పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం

ABN , First Publish Date - 2022-12-13T23:55:09+05:30 IST

మండలంలోని సుద్దులం కంకర క్వారీ విషయం లో మంగళవారం అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా సాగింది.

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం

డిచ్‌పల్లి, డిసెంబరు 13: మండలంలోని సుద్దులం కంకర క్వారీ విషయం లో మంగళవారం అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. సర్వే నంబరు 379 లో (కేఎల్‌ ఎల్లయ్య అండ్‌ సన్స్‌)లో పొల్యూషన్‌ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రజాభిప్రాయ సేకరణ క్వారీ వద్దే ఏర్పాటు చేయించారు. ఇప్పటి వరకు పది హెక్టార్ల క్వారీని తొలగించడం వల్ల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగిందని తహసీల్దార్‌ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారని తహసీల్దార్‌ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజాభిప్రాయ సేకరణ వద్ద ఎస్సై గణేశ్‌ భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కార్యక్రమంలో సుద్దులం, కోరట్‌పల్లి సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:55:09+05:30 IST

Read more