మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-10-03T05:35:29+05:30 IST

మహాత్మాగాంధీ ఆశయసాధనకు కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం మహాత్మాగాంఽఽధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో గాంధీ విగ్ర హానికి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, టీఎన్‌జీవోస్‌ జిల్లా కార్యదర్శి సాయిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి
కామారెడ్డిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌

- ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌
ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, అక్టోబరు 2: మహాత్మాగాంధీ ఆశయసాధనకు కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం మహాత్మాగాంఽఽధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో గాంధీ విగ్ర హానికి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, టీఎన్‌జీవోస్‌ జిల్లా కార్యదర్శి సాయిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేను మరోసారి పోరా టం చేయాల్సి వస్తే స్వాతంత్య్రం కన్న పారిశుధ్యం, పరిశుభ్రత కోసం పోరాటం చేస్తానని గాంధీ చెప్పిన మాటలను ఆయన ఉదాహరించారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గాంధీజీ చిత్రపటానికి గ్రం థాలయ సంస్థ చైర్మన్‌ పున్న రాజేశ్వర్‌ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, కమిషనర్‌ దేవేందర్‌, గంగాభూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట మండలంలోని లింగంపేట, ఐలాపూర్‌, మోతె, పొల్కంపేట గ్రామాల్లో గాంధీ జయ ంతిని నిర్వహించారు. లింగంపేట మండల కేంద్రంలో ఎంపీపీ గరీబున్నీసా, సర్పంచ్‌ లావణ్య, ఆర్యవైశ్యసంఘం నాయకులు, సహకా ర సంఘం మాజీ వైస్‌ చైర్మన్‌ బుర్ర నారాగౌడ్‌లు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా గాంధీజీ సేవలను ఎంపీపీ గరీబున్నీసా కొనియాడారు. ఈ కార్య క్రమంలో నాయకులు నయీం, శ్రీకాంత్‌, నారాగౌడ్‌, కౌడ శ్రీనివాస్‌, పవన్‌, వేను, జొన్నల రాజు, కాముని శ్రీను, నరేష్‌లతో పాటు నాయ కులు ఉన్నారు. బిచ్కుంద మండలంలోని అన్ని గ్రామాల్లో గాంధీ జయం తిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అశోక్‌పటేల్‌ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహానికి వ్యాపారులు, స్థానికులు గాంధీజీకి పూలమాలలు వేశారు. మాచారెడ్డి మండ లంలోని రెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్‌ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సాగౌడ్‌, నాయిని నర్సింలు, భూక్యదాన్‌ సింగ్‌ నాయక్‌, ఇర్షాద్‌, చిన్నరాజయ్య, బాలయ్య, శంకర్‌, కాసీం, రాములు తదితరులు పాల్గొన్నారు. దోమకొండ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. భిక్కనూర్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మ, నాగభూషణం గౌడ్‌, ఎంపీడీవో అనంతరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భగవంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, రైతుబంధు కన్వీనర్‌ రామచంద్రం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విండో చైర్మన్‌లు, నాయకులు పాల్గొన్నారు. సదాశివనగర్‌ మండలంతో పాటు గ్రామాల్లో గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింలు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, బీరయ్య, అల్తాప్‌, వడ్ల రాజేందర్‌, రామచంద్రరావు, రమేష్‌రావు, జూనియర్‌ అసిస్టెంట్‌ చారి, ఎంపీవో సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలంలోని ప్రతీ గ్రామంలో గాంధీజి చిత్ర పటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పౌరాజు, జ్యోతి, నర్సింలు, సంజీవులు, స్వాతి, వినోద్‌గౌడ్‌, నర్సారెడ్డి, ఇందిరా, రాజయ్య, భూషణం, రాధ, బాలచంద్రం, భాగ్యలక్ష్మీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ గాంధీ విగ్రహానికి పూలవేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జీవన్‌, కౌన్సిలర్‌లు రాము, నీలకంఠం, రామప్ప, తిరుపతి, పోచయ్య, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. బీర్కూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో గాంధీ జయంతిని జరుపుకున్నారు. బీర్కూర్‌ గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఆర్యవైశ్య సంఘం, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2022-10-03T05:35:29+05:30 IST