ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-12-04T00:45:37+05:30 IST

దివ్యాంగులు ఏ రంగంలోను ఎవరికి తీసిపోరని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతిఒక్కరు అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్‌ నారాయణరెడ్డి పి లుపునిచ్చారు.

ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకెళ్లాలి
సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్న దివ్యాంగులు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 3: దివ్యాంగులు ఏ రంగంలోను ఎవరికి తీసిపోరని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతిఒక్కరు అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్‌ నారాయణరెడ్డి పి లుపునిచ్చారు. జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివా రం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్‌ నీతూకిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, తదితరులు కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయా రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభపాఠవాలను గుర్తుచేస్తూ వారిని కొనియాడారు. విద్యారంగంతో పాటు క్రీడలు, ఉద్యోగా లు, వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసిన దివ్యాంగులు సమాజంలోని సామాన్యులకు ఎంతమాత్రం తీసిపోకుండా తమ నైపుణ్యాన్ని చాటుకున్నారని కొంతమంది మరింత ముందుంజలో ఉన్నారన్నారు. ఇదే స్పూర్తిని కనబరుస్తూ మరిం త ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, తద్వారా అనేక అద్భుతాలు ఆవిష్కరించాలన్నారు. ప్రభుత్వ తోడ్పాటును అర్హులైన ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకోవాల ని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు సముచిత ప్రాదాన్యం దక్కేలా కృషి చేస్తున్నామన్నారు. వచ్చే నెల జనవరిలో పంపిణి చేయను న్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన దివ్యాంగులకు వారి కోటాను అనుసరిస్తూ తప్పనిసరిగాకేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా శాఖల్లో ఖాళీల భర్తీని బట్టి ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించేందుకు బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీచేస్తామన్నారు. ప్రిమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లలో ఇప్పటికే దివ్యాంగులకు ప్రాదాన్యత ఇస్తున్నామని వారి సమస్యలను తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. వివిధ రం గాల్లో ప్రతిభకనబర్చిన దివ్యాంగులకు ఈ సందర్భంగా శాలువా, ప్రశసంపత్రాల తో సత్కరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలపించి న గేయాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు సుదం లక్ష్మి, డీఆర్‌డీవో చందర్‌, డీడబ్ల్యువో సుదారాణి, దివ్యాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T00:45:41+05:30 IST