రుణాలను సకాలంలో చెల్లించాలి

ABN , First Publish Date - 2022-02-17T05:22:23+05:30 IST

జుక్కల్‌ మండల కేంద్రంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రుణాలను సకాలంలో చెల్లించాలి
జుక్కల్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌

జుక్కల్‌, ఫిబ్రవరి 16: జుక్కల్‌ మండల కేంద్రంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా పరస్పర పొదుపు పరపతిపై పెద్దకొడప్‌గల్‌, మద్నూర్‌, జుక్కల్‌ మహిళా సంఘాల అభివృద్ధి పనులపై సమీక్షించారు. రుణాలు తీసుకున్న వారు సకాలంలో రుణాలు చెల్లించాలన్నారు. ఆయా మండలాల్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారికి ఒకటికి రెండు సార్లు చెప్పి చూడాలని, ఎవరైనా కట్టకుండా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఏపీఎంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల రికవరీల్లో వెనుకబాటు తగదన్నారు. జుక్కల్‌ మండలంలోని మాదాపూర్‌, పెద్దఎడ్లి, చండేగాం తదితర గ్రామాలపై నోటీసులు ఇవ్వాలని మహిళా సంఘాలు మిగతా వారికి ఇబ్బంది గురిచేయరాదన్నారు. వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని సకాలంలో చెల్లిస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read more