ఆంధ్రలో కలిపేందుకు కుట్ర
ABN , First Publish Date - 2022-02-19T06:22:21+05:30 IST
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణను ఆంధ్రలో కలిపేందుకు ప్రధాని మోదీ కుట్రపన్నుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలో పలు నూతన గ్రామపంచాయతీ ఎస్సీ భవనాలు, బీటీరోడ్ల ప్రారంభ శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీజేపీ తీరుపై మండిపడ్డారు.

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
బాల్కొండ, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణను ఆంధ్రలో కలిపేందుకు ప్రధాని మోదీ కుట్రపన్నుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలో పలు నూతన గ్రామపంచాయతీ ఎస్సీ భవనాలు, బీటీరోడ్ల ప్రారంభ శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకను అవమానిస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. బాగుపడుతున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలుపుతారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మంతెన చిన్నయ్య, బూస సునీత, వనజ, నాగుపల్లి భూదేవి, రవి, ఎంబారి పెద్ద లింబాన్న, ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ దాసరి లావణ్య, పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఫ చిలుకలచిన్నమ్మను దర్శించుకున్న మంత్రి..
శ్రీరాంపూర్‌లో చిలుకల చిన్నమ్మ ఆలయాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి దర్శించుకున్నారు. బాల్కొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రి మార్గమధ్యంలో ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
ఫ నేడు మంత్రి వేముల రాక..
మోర్తాడ్: మండలంలోని దొన్కల్, దర్మోరా, శెట్పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రానున్నారని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా తెలిపారు.