రెండు గజాల స్థలం కోసం ఘర్షణ

ABN , First Publish Date - 2022-03-06T04:56:08+05:30 IST

రెండు గజాల స్థలం కోసం రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

రెండు గజాల స్థలం కోసం ఘర్షణ

భిక్కనూర్‌, మార్చి 5: రెండు గజాల స్థలం కోసం రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోళ్ల చిన్నమల్లయ్యకు ఉన్న రెండు గజాల భూమి పక్కనే ఉన్న భూమయ్య, బాలమల్లు, యాదిరెడ్డి భూములు ఉన్నాయి. భూముల సరిహద్దు విషయంలో మల్లయ్య ప్రశ్నించడంతో మాటమాట పెరిగి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిని ఆపేందుకు అక్కడే ఉన్న మహిళలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. దింతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు గజాల స్థలం కబ్జా చేయడమే కాక తమపై దాడి చేశారని మల్లయ్య, రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు భిక్కనూర్‌ ఎస్‌ఐహైమద్‌ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more