కన్నుల పండువగా రథోత్సవం

ABN , First Publish Date - 2022-02-17T05:23:05+05:30 IST

ఖిల్లా డిచ్‌పల్లి సీతారామచంద్ర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవానికి నలువైపులా రకరకాల పూలు, విద్యుత్‌ లైట్లు అందంగా ఏర్పాటు చేశారు.

కన్నుల పండువగా రథోత్సవం

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16: ఖిల్లా డిచ్‌పల్లి సీతారామచంద్ర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవానికి నలువైపులా రకరకాల పూలు, విద్యుత్‌ లైట్లు అందంగా ఏర్పాటు చేశారు. అంతకు ముందు నిత్యహోమం, బలి హరణం, రథ ప్రతిష్ట, రథ హోమం కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాగే గురువారం ఉదయం నిత్య హోమం, పూర్ణహుతి, కార్యక్రమాలతోపాటు దేవతా మూర్తులను వనవిహారం నిర్వహించనున్నారు. చక్రతీర్థం అనంతరం అవిభక్త స్నానం, నిర్వహిస్తారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. 

Read more