పౌష్టికాహారం అందించలేం

ABN , First Publish Date - 2022-12-13T23:53:09+05:30 IST

విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేమని మధ్యాహ్న భోజన పథకం ద్వారా కోడిగుడ్డును ఇవ్వలేమని మధ్యాహ్నభోజన ఏజెన్సీలు సోమవారం ధర్పలి, డిచ్‌పల్లి ఎంఈవో కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు.

పౌష్టికాహారం అందించలేం

ధర్పల్లి/ డిచ్‌పల్లి, డిసెంబరు 13 : విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేమని మధ్యాహ్న భోజన పథకం ద్వారా కోడిగుడ్డును ఇవ్వలేమని మధ్యాహ్నభోజన ఏజెన్సీలు సోమవారం ధర్పలి, డిచ్‌పల్లి ఎంఈవో కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఎంఈవోలకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎండీఎం జిల్లా ప్రధానకార్యదర్శి తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరితో మధ్యాహ్నభోజన పథకం కార్మికులపై కక్ష సాధింపు చర్య తీసుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వినతి పత్రం ఇస్తేనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నో వినతిపత్రాలు ఇచ్చిన ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. మార్కెట్లో ధరలు పెరిగిపోయాయని కోడిగుడ్డు ధర రూ.7లు పలుకుతుందన్నారు. ప్రభుత్వం రూ.5లకే కోడి గుడ్డు అందించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పుడున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ కెటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో శారదలక్ష్మి, లత, గంగవ్వ, పావని, రాజమణి, సునీత, మనోహర్‌, బాల్‌రాజ్‌, సులోచన, ఒడ్డెమ్మ, సునీత, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:53:10+05:30 IST