రెండు లైన్‌లు ఖరారు

ABN , First Publish Date - 2022-12-04T00:43:28+05:30 IST

జిల్లా మీదుగా రైల్వే డబుల్‌ లైన్‌ ప్రతిపాదనలకు రైల్వేబోర్డ్‌ ఒకే చేసింది.

 రెండు లైన్‌లు ఖరారు

ముథ్కేడ్‌ నుంచి జిల్లా మీదుగా మేడ్చల్‌కు

అనుమతించిన రైల్వే బోర్డు

నిజామాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా మీదుగా రైల్వే డబుల్‌ లైన్‌ ప్రతిపాదనలకు రైల్వేబోర్డ్‌ ఒకే చేసింది. ముథ్కేడ్‌, మేడ్చల్‌ వరకు నిర్మాణం చేపట్టి డబుల్‌ లైన్‌తో పాటు ఎలక్ర్టిఫికేషన్‌ కోసం రైల్వే అదికారులు చేపట్టిన ప్రతిపాదనలను అనుమతించారు. బడ్జెట్‌లో నిదులను కేటాయించి చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ డబుల్‌ లైన్‌ నిర్మాణం చేపడితే జిల్లా మీదుగా ఎక్కువ రైళ్లు నడిచే అవకాశం ఉండడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే దూరం తగ్గనుంది.

నిజాం కాలంలో రైల్వే లైన్‌ నిర్మాణం

నిజాం కాలంలో జిల్లా మీదుగా ఔరంగబాద్‌, ముంబై వరకు రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టారు. సికింద్రబాద్‌ నుంచి ముంబై వరకు రైళ్లు నడిపారు. మొదట మీటర్‌గేజ్‌, తర్వాత బ్రాడ్‌గేజ్‌గా మార్చినా.. డబుల్‌ లైన్‌ మాత్రం చేపట్టలేదు. ఉన్న లైన్‌కు రైళ్లు ఎక్కువగా పెంచడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లావాసులతో పాటు మహారాష్ట్రలోని ప్రజలు కూడా డబుల్‌ లైన్‌ కోసం ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర లో ముథ్కేడ్‌ వరకు డబుల్‌ లైన్‌ పూర్తయ్యింది. ముథ్కేడ్‌ నుంచి జిల్లా మీదుగా మేడ్చల్‌ వరకు 418 కి.మీ.లు నిర్మాణం చేపట్టేందుకు రూ.4,686 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. రైల్వే బోర్డుకు అందించారు. ఈ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు కూడా అనుమతులను ఇచ్చింది.

చ్చే బడ్జెట్‌లో నిధుల విడుదల!!

వచ్చే బడ్జెట్‌లో నిధులు విడుదల చేసి పనులు చేపట్టే అవకాశం ఉన్న ట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన అధికారుల సమాచారం బట్టి తెలుస్తుంది. ముథ్కేడ్‌ నుంచి బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి, మేడ్చల్‌ వర కు ఈ డబుల్‌ లైన్‌ నిర్మాణం చేపడతారు. డబుల్‌ లైన్‌తో పాటు ఎలక్ర్టిఫికేషన్‌ కూడా చేస్తారు. ఈ రెండింటిని కలిపి ఈ నిధులు వెచ్చించనున్నా రు. మహారాష్ట్రలో మొత్తం డబుల్‌ లైన్‌ నిర్మాణం ముంబై వరకు పూర్తయి నా.. ఈవైపు లేకపోవడం వల్ల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. ఎదురుగా వచ్చే రైళ్ల వల్ల ఆయా స్టేషన్‌ల పరిదిలో ముందుగా నిలిపివేయడం వల్ల నిర్ణీత సమయంలో చేరుకోలేకపోతున్నారు. రైళ్ల సంఖ్య పెంచినా.. ఇబ్బం దులు ఎదురవుతుండడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేబోర్డు పూర్తిప్రతిపాదనలు చేసి నిధులను విడుదల చేస్తే ఈ పనులను చేపట్టనున్నారు. ఈ రైల్వే డబుల్‌ లైన్‌ పూర్తిచేస్తే జిల్లాలో ఉపయోగపడడంతో పాటు వ్యాపార అభివృద్ధి పెరుగుతుందని రైల్వే జోనల్‌ యూ జర్స్‌ కమిటీ సభ్యుడు జీ.మనోహన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ ప్రాంత ఎంపీలు మరింత దృష్టిపెట్టి నిధులను విడుదల చేయిస్తే పనులు త్వరగా మొదలు పెట్టే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2022-12-04T00:43:30+05:30 IST