ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-30T05:52:26+05:30 IST

ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో గురువారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన సతీమణి పుష్పతో కలిసి పాల్గొన్నారు.

ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ
నస్రుల్లాబాద్‌లో బతుకమ్మ ఎత్తుకున్న స్పీకర్‌ పోచారం

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న స్పీకర్‌ పోచారం

నస్రుల్లాబాద్‌, సెప్టెంబరు 29: ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో గురువారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన సతీమణి పుష్పతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మను నెత్తిన పెట్టుకుని గ్రామంలోని రామాలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయం వద్ద బతుకమ్మలను పెట్టి మహిళలతో బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ అని ఆయన అన్నారు. కాగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఆడపడుచులకు ప్రతీయేట బతుకమ్మ చీరలను కానుకగా అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్‌, జడ్పీటీసీ జన్నుబాయి, గ్రామ మహిళలు పాల్గొన్నారు. 


అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికే ఆదర్శం

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన  బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడానికి రూ.120 కోట్లతో సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నామన్నారు. సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో వర్ని, బాన్సువాడ, గాంధారి మండలంలోని 20 తండాలు, పది గ్రామాల పరిధిలోని 14 వేల ఎకరాలకుపైగా మెట్ట ప్రాంతంలోని భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ కాలువల ద్వారా 27 చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రిజర్వాయర్‌ పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే మిరుగం నాటికి రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Read more