ఒకరిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2022-07-08T05:29:06+05:30 IST

భార్యభర్తల గొడవలో మధ్యవర్తిగా ఉన్న ఉస్మాన్‌పై బాబు కత్తి తో దాడిచేసిన ఘటన ఒకటో టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధి లో బుధవారం రాత్రి జరిగింది. బాబుఖాన్‌, ఫర్హానబేగం లు గత కొతకాలంగా గొడవ పడి ఇద్దరు వేర్వేరు చోట ని వాసం ఉంటున్నారు. వారిని కలుపడానికి తన్వీర్‌, ఉస్మాన్‌ లు మధ్యవర్తులుగా వ్యవహరించారు. అయితే ఇద్దరు కూడా భార్య ఫర్హానబేగంకు మద్దతు పలుకుతుండడంతో ఆగ్రహంతో ఉన్న బాబుఖాన్‌ తన్వీర్‌ను చంపుతానని వెతికాడు. తన్వీర్‌ దొరుకకపోవడంతో ఉస్మాన్‌ ఇంటికి వెళ్లి తన్వీర్‌ అడ్రస్‌ చెప్పాలని నిలదీశాడు. ఎంతకి అడ్రస్‌ చెప్పకపోవడంతో ఉస్మాన్‌పై బాబుఖాన్‌ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతడికి గాయాలు కావడంతో స్థా నికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఒకటోటౌన్‌ ఎస్‌ హెచ్‌వో డి.విజయ్‌బాబు బాబుఖాన్‌ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి గురువారం అతడిని రిమాండ్‌ కు తరలించారు.

ఒకరిపై కత్తితో దాడి

భార్యభర్తల గొడవలో మధ్యవర్తిత్వం వహించినందుకు 

ఖిల్లా, జూలై 7: భార్యభర్తల గొడవలో మధ్యవర్తిగా ఉన్న ఉస్మాన్‌పై బాబు కత్తి తో దాడిచేసిన ఘటన ఒకటో టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధి లో బుధవారం రాత్రి జరిగింది. బాబుఖాన్‌, ఫర్హానబేగం లు గత కొతకాలంగా గొడవ పడి ఇద్దరు వేర్వేరు చోట ని వాసం ఉంటున్నారు. వారిని కలుపడానికి తన్వీర్‌, ఉస్మాన్‌ లు మధ్యవర్తులుగా వ్యవహరించారు. అయితే ఇద్దరు కూడా భార్య ఫర్హానబేగంకు మద్దతు పలుకుతుండడంతో ఆగ్రహంతో ఉన్న బాబుఖాన్‌ తన్వీర్‌ను చంపుతానని వెతికాడు. తన్వీర్‌ దొరుకకపోవడంతో ఉస్మాన్‌ ఇంటికి వెళ్లి తన్వీర్‌ అడ్రస్‌ చెప్పాలని నిలదీశాడు. ఎంతకి అడ్రస్‌ చెప్పకపోవడంతో ఉస్మాన్‌పై బాబుఖాన్‌ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతడికి గాయాలు కావడంతో స్థా నికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఒకటోటౌన్‌ ఎస్‌ హెచ్‌వో డి.విజయ్‌బాబు బాబుఖాన్‌ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి గురువారం అతడిని రిమాండ్‌ కు తరలించారు. 

Read more