సేవాలాల్‌ గద్దెను కూల్చారంటూ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-11-27T00:50:11+05:30 IST

మండలకేంద్రంలోని ఓ ప్రార్థన మందిరం పక్కన గల ప్రభుత్వ భూమిలో గిరిజనులు ఏర్పాటు చేసుకున్న ఆరాధ్య దైవం జగదంబా, సేవాలాల్‌ మహరాజ్‌ల గద్దెలను కూల్చివేసి జెండాలను పారేయడం తో శనివారం స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సేవాలాల్‌ గద్దెను కూల్చారంటూ ఆగ్రహం
ఇందల్‌వాయిలో రాస్తారోకో చేస్తున్న గిరిజనులు

భారీగా నిలిచిన వాహనాలు

ఇందల్‌వాయి, నవంబరు 26: మండలకేంద్రంలోని ఓ ప్రార్థన మందిరం పక్కన గల ప్రభుత్వ భూమిలో గిరిజనులు ఏర్పాటు చేసుకున్న ఆరాధ్య దైవం జగదంబా, సేవాలాల్‌ మహరాజ్‌ల గద్దెలను కూల్చివేసి జెండాలను పారేయడం తో శనివారం స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సాయిబాబా ఆలయం నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ ని ర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఇందల్‌వాయి నుంచి ధర్పల్లి వెళ్లే రోడ్డులో బైఠాయించి ధర్నా నిర్వహించారు. నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ ఎత్తున వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. పోలీసులు ఎంతచెప్పినా వినిపించుకోకపోవడంతో గత్యంతరం లేక వాహనాలను తిర్మన్‌పల్లి నుంచి దారి మళ్లించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ తమ ఆరాధ్యదైవం అయిన సేవాలా ల్‌ జగదాంబ మహరాజ్‌ల గద్దెలను ఓ వర్గం వారు కూల్చివేశారని, వెంటనే కూల్చివేసిన గద్దెలను ఏర్పాటు చేసే వరకు కదిలేదిలేదని పట్టుబట్టారు. ఎస్‌ఐ నరేష్‌, తహసీల్దార్‌ రోజాలు వచ్చి గిరిజన నాయకులతో మాట్లాడిన ఎలాంటి ఫలితం లేకపోవడంతో వారు పైఅధికారులకు విన్నవించారు. ఆర్‌డీవో, కలెక్టర్‌, సీపీలతో మాట్లాడడంతో మూడు గంటల తర్వాత ఏసీపీ వెంకటేశ్వర్లు సంఘట న స్థలానికి చేరుకుని గిరిజనులతో మాట్లాడినా వినిపించుకోలేదు. ఓ వర్గం వారు తొలగించిన గద్దెలను ఏర్పాటు చేసే వరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. గత నెల రోజులుగా జేసీబీతో చదునుచేసి జగదాంబ, సేవాలాల్‌ ఆలయాలు నిర్మించేందుకు జెండాలను ఏర్పాటు చేశామని గిరిజనులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల నాయకులు, మండల అధ్యక్షుడు తుకారాం నాయక్‌, మోహన్‌నాయక్‌, మాజీ ఎంపీపీ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు రాము లు నాయక్‌, మోహన్‌నాయక్‌, అంబర్‌సింగ్‌, చందర్‌నాయక్‌, మోతిలాల్‌నాయక్‌, గిరిజన నాయకులు, యువకులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T00:50:15+05:30 IST