కాంగ్రెస్‌లో కార్యకర్తకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-03-04T05:40:04+05:30 IST

కాంగ్రెస్‌లో కార్యకర్తకే అధిక ప్రాధాన్యం ఉం టుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంకు సంబంధించిన 40వేల సభ్యత్వాలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ కోసం రూ.10 లక్షల చెక్కును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అందజేశారు.

కాంగ్రెస్‌లో కార్యకర్తకే ప్రాధాన్యం

మాజీ మంత్రి షబ్బీర్‌అలీ

కామారెడ్డి, మార్చి 3: కాంగ్రెస్‌లో కార్యకర్తకే అధిక ప్రాధాన్యం ఉం టుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంకు సంబంధించిన 40వేల సభ్యత్వాలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ కోసం రూ.10 లక్షల చెక్కును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వంతో పాటు ప్రతీ కార్యకర్తకు రూ.2లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు సొంత నిధులతో బీమా చెల్లిస్తానని మాట ఇచ్చానన్నారు. దాంట్లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలోని 40వేల మంది కార్యకర్తలకు బీమా చే యించానన్నారు. ఇంకా ఎన్ని సభ్యత్వాలైన వారందరికి బీమాకు సంబ ంధించిన డబ్బులను చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతవరకైనా వెళ్తానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని అన్నారు. 20 23లో ఉమ్మడి నిజామాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెం డా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు. అందుకు ప్రతీ కార్యకర్త ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

Read more