తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , First Publish Date - 2022-09-17T05:30:00+05:30 IST

మండలంలోని అచ్చంపేట సమీపంలో నర్సాపూర్‌-వెల్దుర్తి రోడ్డుపై ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఆటో ఓ మహిళ తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మరణించింది.

తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మహిళ మృతి

నర్సాపూర్‌, సెప్టెంబరు 17: మండలంలోని అచ్చంపేట సమీపంలో నర్సాపూర్‌-వెల్దుర్తి రోడ్డుపై ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఆటో ఓ మహిళ తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మరణించింది. శనివారం సాయంత్రం ఎస్‌ఐ గంగరాజు  విలేకరులతో మాట్లాడుతూ... విఠల్‌తండాకు చెందిన రమేష్‌, శారద(32)దంపతులతో పాటు మరికొందరు శుక్రవారం నర్సాపూర్‌ నుంచి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని అచ్చంపేట శివారులోకి చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వస్తున్న బైక్‌ ఆటోను డీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న శారదకు తీవ్ర గాయాలకు కాగా ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆమె శనివారం మరణించింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read more