విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయురాలు

ABN , First Publish Date - 2022-11-30T00:16:35+05:30 IST

కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌ ఆదర్శ పాఠశాలలో తెలుగు ఉపా ధ్యాయురాలు విద్యార్థినులను చితక బాదడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేశారు.

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయురాలు

విద్యార్థుల ఆందోళన

మద్నూర్‌, నవంబరు 29 : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌ ఆదర్శ పాఠశాలలో తెలుగు ఉపా ధ్యాయురాలు విద్యార్థినులను చితక బాదడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేశారు. సోమవారం పాఠశాల ఆవరణలో మెట్లపై కూర్చొని ధర్నా చేశారు. ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని ఇన్‌స్ర్టాగాంలో సోదీ క్లాస్‌ అంటూ పోస్టు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఉపాధ్యాయురాలు విద్యార్థినులందరినీ గదిలో వేసి, దుస్తులు ఊడదీసి కొట్టినట్లు ఆరోపించారు. ఒక్కరు చేసిన పొరపాటుకు అందరిని చితక బాదడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సదరు విద్యార్థిని రెండు సార్లు క్షమాపణ చెప్పినా ఆగ్రహంతో ఊగి పోతూ బెత్తంతో కొట్టడం సరికా దన్నారు. ప్రిన్సిపాల్‌ లావణ్యను వివరణ కోరగా, విద్యార్థులను కొట్టడం తప్పేనని, జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తానన్నారు. ఉపాధ్యా యురాలిని సస్పెండ్‌చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. తమ పిల్లలను హాస్టల్‌లో ఉంటూ చదివిస్తున్నామని, వారి వద్ద ఎటువంటి సెల్‌ఫోన్‌లు లేకున్నా వారిని చితక బాదడంపై ఆందోళన చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పాఠశాల నడుపుతున్న ప్రిన్సిపాల్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

Updated Date - 2022-11-30T00:16:39+05:30 IST