గుంతలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-09-21T05:53:33+05:30 IST

మండలంలోని కుందాపూర్‌ గ్రామ శివారులో కోటగిరికి చెందిన గొడుగు పెద్దసాయిలు పొలానికి గట్టుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడి మృతి చెందాడు. పెద్ద సాయిలు ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూసేసరికి నీటి గుంతలో పడి చనిపోయి ఉన్నాడు. మృతుడి భార్య పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు రుద్రూరు ఎస్సై రవీందర్‌ తెలిపారు.

గుంతలో పడి వ్యక్తి మృతి

రుద్రూరు, సెప్టెంబరు 20: మండలంలోని కుందాపూర్‌ గ్రామ శివారులో కోటగిరికి చెందిన గొడుగు పెద్దసాయిలు పొలానికి గట్టుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడి మృతి చెందాడు. పెద్ద సాయిలు ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూసేసరికి నీటి గుంతలో పడి చనిపోయి ఉన్నాడు. మృతుడి భార్య పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు రుద్రూరు ఎస్సై రవీందర్‌ తెలిపారు. 

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

చందూర్‌: చందూర్‌ శివారులోని నిజాంసాగర్‌ కాలువలో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలువల మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఐదు రోజుల క్రితం కాలువలో పడిపోయి కొట్టుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. వర్ని ఏఎస్సై నాగభూషణం ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read more