ఓటర్ల జాబితాను రూపొందించాలి

ABN , First Publish Date - 2022-12-04T23:35:48+05:30 IST

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

ఓటర్ల జాబితాను రూపొందించాలి

సదాశివనగర్‌, డిసెంబరు 4: ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లందరికీ ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికి సహకరించాలని కోరారు. ఫారం బీ వినియోగించి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫారం-8 నింపి ఇంటి చిరునామా మార్పులు, సవరణలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ వెంకట్‌రావు, బూత్‌ లెవల్‌ అధికారులు పాల్గొన్నారు.

భిక్కనూరు: ఓటరు నమోదు ప్రక్రియలో తప్పులు లేకుండా చూడాని భిక్కనూరు తహసీల్దార్‌ నర్సింలు సూచించారు. ఆదివారం భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో పోలింగ్‌ బూత్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు తదితర వాటిని ఎలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింలు యాదవ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ సిద్ధి రాములు, ఎంపీటీసీ యశోద, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:35:50+05:30 IST