ప్రతీ అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలి

ABN , First Publish Date - 2022-02-23T05:48:58+05:30 IST

ప్రతీ అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలి

ప్రతీ అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలి

 సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వీసీ బీజేరావు

 నిట్‌లో ప్రారంభమైన సైన్స్‌ వీక్‌ ఫెస్టివల్‌ 

కాజీపేట, ఫిబ్రవరి 22: విద్యార్థులు తరగతి గదులకు పరిమితం కాకుండా తరగతి గదుల వెలుపల జరిగే వాటిపై అవగాహన పెంచుకోవాలని, ప్రతీ అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీ బీ.జేరావు అన్నారు. 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర సముపార్జన సంబరాల్లో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం అనే నినాదంతో వరంగల్‌ నిట్‌లో మంగళవారం సైన్స్‌ వీక్‌ ఫెస్టివల్‌ వేడుకులు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంబేద్కర్‌ లర్నింగ్‌ సెంటర్‌లో ప్రారంభమైన ఈ వేడుకల్లో వీసీ బీజే. రావు హాజరై మాట్లాడారు. మానవ జీవనశైలిలో సాంకేతిక అభివృద్ధితోనే రూపాంతరం చెందిందన్నారు. యువత స్వతంత్య్ర అభిప్రాయాన్ని కలిగి ఉండి సొంత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు మాటాడారు. 

సైన్స్‌ పురోగతితో విభిన్న రంగాల్లో సాంకేతిక అభివృద్ధి కనిపిస్తుందన్నారు. దేశ నిర్మాణంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని ప్రతీ విద్యార్థి అర్ధం చేసుకోవాలన్నారు. అనంతరం నిట్‌ అధ్యాపక బృందంతో ఏర్పాటుచేసిన సైన్స్‌ ప్రయోగశాల ప్రదర్శన తిలకించారు. ఆ తర్వాత జాతీయస్థాయి ఢిల్లీలో జరుగుతున్న ప్రారంభ సభ వైజ్ఞానిక వారోత్సవాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించారు. నిట్‌ ప్రొఫెసర్‌ కె. లక్ష్మారెడ్డి నేతృత్వంలో స్కోప్‌ ప్రాజెక్టు ద్వారా, సమన్వయకర్తగా రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎ.రామచంద్రయ్య నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎస్‌.గోవర్ధన్‌రావు, ప్రొఫెసర్‌  కృష్ణాన ందం, ప్రొఫెసర్‌ ఆంజనేయులు, డాక్టర్‌ కాశీనాధ్‌, డీన్స్‌, పీహెడీ స్కాలర్స్‌, వివిఽధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Read more