ప్రజాస్వామ్యంలో కుట్రలకు తావులేదు: కవిత

ABN , First Publish Date - 2022-08-06T08:56:13+05:30 IST

పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు.

ప్రజాస్వామ్యంలో కుట్రలకు తావులేదు: కవిత

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. శుక్రవారం ఆమె బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి  పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కుట్రలకు తావు లేదని, ఆ విధానాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.  

Read more