అడ్డదిడ్డంగా మాట్లాడిన మల్లారెడ్డికి తగిన శాస్తి జరిగింది: నాయిని

ABN , First Publish Date - 2022-05-30T16:55:07+05:30 IST

అడ్డదిడ్డంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డికి తగిన శాస్తి జరిగిందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

అడ్డదిడ్డంగా మాట్లాడిన మల్లారెడ్డికి తగిన శాస్తి జరిగింది: నాయిని

హనుమకొండ : అడ్డదిడ్డంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డికి తగిన శాస్తి జరిగిందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులపై ప్రజలు తిరగబడుతున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు రాజ్యాంగబద్దంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ జీవో ఎందుకు రద్దు చేస్తలేరో ప్రజలకు సమాధానం చెప్పాలని నాయిని పేర్కొన్నారు. భూములు ఇవ్వడానికి రైతులెవరూ ముందుకు రావడం లేదన్నారు. సాయంత్రం లోపు ల్యాండ్ పూలింగ్ జీవో వెనక్కి తీసుకోకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు కాదని.. ల్యాండ్ బ్రోకర్లన్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తే మా నాయకులను అరెస్ట్ చేస్తారా? అని నాయిని ప్రశ్నించారు. 


Read more