నర్సంపేట విద్యార్థినులకు జాతీయ స్థాయి అవార్డులు

ABN , First Publish Date - 2022-01-03T16:35:52+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా బాసరలో సనాతన కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ శ్రీవేద భారత పీఠం ఆధ్వర్యంలో ఆదివారం..

నర్సంపేట విద్యార్థినులకు జాతీయ స్థాయి అవార్డులు

నర్సంపేట టౌన్‌, జనవరి 2 : నిజామాబాద్‌ జిల్లా బాసరలో సనాతన కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ శ్రీవేద భారత పీఠం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో నర్సంపేట శ్రీనాట్యవేద కళాక్షేత్రం విద్యార్థినిలు ప్రతిభ చాటారు. కొయ్యడి ఆరాధ్య, తాత్కి, గొడిశాల లక్ష్య, ఎం. ఆరాధ్య, సహస్రిత, వినూత్న, సాయిశ్రీ, శివనందిని పాల్గొని ఉత్తమ ప్రదర్శన చేశారు. పోటీల్లో వీరందరికి నాట్య కుసుమం అవార్డులతో పాటు విద్యార్థుల గురువు మడిపెద్ది పరంజ్యోతికి నాట్య తపస్వి పురస్కారం లభించింది. నర్సంపేట విద్యార్థినులకు 8 జాతీయ స్థాయి అవార్డులు రావడంపై పట్టణ ప్రముఖులు అభినందించారు.

Read more