‘దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌’లో నరేంద్రకుమార్‌

ABN , First Publish Date - 2022-07-05T10:23:21+05:30 IST

సర్కార్‌ దవాఖాన వైద్యులంటే.. సమయానికి రారు. రోగులను సరిగ్గా చూడరు. వాళ్ల దృష్టంతా ప్రైవేటు ప్రాక్టీసు మీదనే ఉంటుంది అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం.

‘దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌’లో నరేంద్రకుమార్‌

  • ఇండియా టుడే జాబితాలో వనపర్తి సూపరింటెండెంట్‌
  • ఈ జాబితాలో ప్రభుత్వ వైద్యుడు ఆయనొక్కరే
  • నరేంద్రకుమార్‌ను అభినందించిన మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): సర్కార్‌ దవాఖాన వైద్యులంటే.. సమయానికి రారు. రోగులను సరిగ్గా చూడరు. వాళ్ల దృష్టంతా ప్రైవేటు ప్రాక్టీసు మీదనే ఉంటుంది అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ ఈ వైద్యుడు అలా కాదు. చిత్తశుద్ధితో పనిచేస్తారు. అందుకే ఇండియా టుడే ‘దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌’ జాబితాలో చోటు సంపాదించిన ఏకైన ప్రభుత్వ వైద్యుడిగా నిలిచారు. ఆయనే డాక్టర్‌ నరేంద్ర కుమార్‌. వనపర్తి జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌. పీడియాట్రిక్‌ సర్జన్‌గా వైద్య సేవలందిస్తున్నారు. ఇండియా టుడే జాబితాలో చోటు సంపాదించడంపై నరేంద్ర కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు వైద్యం అందించేందుకు మరింత కృషి చేస్తానన్నారు.  నరేంద్ర కుమార్‌ను  మంత్రులు హరీశ్‌, నిరంజన్‌ రెడ్డి అభినందించారు.

Read more