బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు

ABN , First Publish Date - 2022-02-23T09:17:03+05:30 IST

‘‘బయ్యారం ఉక్కు కర్మాగారం.. తెలంగాణ రాష్ట్ర హక్కు..

బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు

కేంద్రం వైఖరిపై నేడు బయ్యారంలో నిరసన: ఎంపీలు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘బయ్యారం ఉక్కు కర్మాగారం.. తెలంగాణ రాష్ట్ర హక్కు.. రాష్ట్రం ఏర్పడక ముందు నుంచీ ఉన్న డిమాండ్‌ ఇది’’ అని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీ మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిన భాద్యత కేంద్రానిదే అన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గిరిజనులను ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా బయ్యారంలో బుధవారం (నేడు) నిరసన చేపడతామని వారు తెలిపారు. 

Read more