షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో తేనెటీగల దాడి

ABN , First Publish Date - 2022-03-23T18:34:27+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో తేనెటీగలు దాడి చేశాయి.

షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో తేనెటీగల దాడి

యాదాద్రి: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో తేనెటీగలు దాడి చేశాయి. జిల్లాలోని మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో దుర్గసానినపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. కాగా... తేనెటీగల దాడి నుంచి షర్మిల బయటపడ్డారు. పలువురు కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. 

Read more