ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-28T05:55:23+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో యువ కుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూర్‌నగ ర్‌లో మంగళవారం జరిగింది.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
పృద్వీరాజ్‌(ఫైల్‌)

హుజూర్‌నగర్‌, సెప్టెంబర్‌ 27: ఆర్థిక ఇబ్బందులతో యువ కుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూర్‌నగ ర్‌లో మంగళవారం జరిగింది. ఏఎ్‌సఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఎస్‌బీహెచ్‌కాలనీకి చెందిన మూడొత్తుల పృధ్వీరాజ్‌(28) కొన్నిరోజులుగా ఖమ్మంలోని ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న సాయంత్రం డ్యూటీ ముగిసిన తర్వాత హుజూర్‌నగర్‌లోని ఇంటికి వచ్చి పడుకున్నాడు. మంగళవారం ఉదయం ఏడుగంటలకు ‘జాగ్ర త్తగా ఉండు చెల్లి’ అని మండలంలోని అల్లీపురంరలో ఉంటున్న చెల్లి భార్గవికి ఫోన్‌లో మెసేజ్‌ పెట్టాడు. భార్గవికి అనుమానం వచ్చి హుజూర్‌నగర్‌లో ఇంటి పక్కనే ఉన్న వారికి తన అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడమని చెప్పింది. కాగా వారు వచ్చి చూడగా, ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు. కొద్దిసేపటి తరువాత పృధ్వీరాజ్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఆ తర్వాత గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం అనం తరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. చెల్లెలు భార్గవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ శ్రీనివాస్‌ తెలిపారు. 


Read more