యాదాద్రిలో మూడో రోజు మహాకుంభ సంప్రోక్షణ పూజలు

ABN , First Publish Date - 2022-03-23T19:20:33+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా 3వ రోజు బాలాలయంలో...

యాదాద్రిలో మూడో రోజు మహాకుంభ సంప్రోక్షణ పూజలు

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా 3వ రోజు బాలాలయంలో అర్చకులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో శాంతి పాఠం, ద్వారతోరణం, ధ్వజ కుంభారాధనలు, చతుస్థానార్చన మూలమంత్ర హావనములు,  షోడశకలషాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణము, యాగశాలలో ద్వారతోరణ ధ్వజ కుంభ ఆరాధనలు, మూల మంత్ర హావనములు, పంచగ వ్యాధి వాసం, నిత్య లఘు పూర్ణాహుతి పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. 

Read more