బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-10-09T04:53:58+05:30 IST

బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి కృషిచేస్తానని అసోసియేషన్‌ నూతన చైర్‌పర్సన్‌ చింతా కవితారాధారెడ్డి అన్నారు

బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి కృషి
ఎంపీపీ కవితారెడ్డిని సన్మానిస్తున్న అసోసియేషన్‌ సభ్యులు

కోదాడ టౌన్‌, అక్టోబరు 8: బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి కృషిచేస్తానని అసోసియేషన్‌ నూతన చైర్‌పర్సన్‌ చింతా కవితారాధారెడ్డి అన్నారు. ఎంఎస్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా బాస్కెట్‌బాల్‌ చైర్‌పర్సన్‌గా ఎంపికలో సహకరించిన మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌కు అసోసియేషన్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అల్లం ప్రభాకర్‌రెడ్డి, మహ్మద్‌ హఫీ్‌సఖాన్‌, కర్తయ్య, నామా నర్సింహారావు, వెంకట్‌రెడ్డి, నాగిరెడ్డి, ఏఎ్‌సరావు, కల్యాణ్‌ పాల్గొన్నారు. 


Read more