గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN , First Publish Date - 2022-09-12T04:57:42+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృతనిశ్చయంతో పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ పిలుపునిచ్చారు.

గెలుపే లక్ష్యంగా పని చేయాలి
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ను సన్మానిస్తున్న రాజగోపాల్‌రెడ్డి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌

మునుగోడు, సెప్టెంబరు 11: మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృతనిశ్చయంతో పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధా ని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అందుకు కార్యకర్తలు గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయాలన్నా రు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి ఓట్లను రా బట్టాలన్నారు. దీంట్లో కార్యకర్తలదే క్రీయాశీలక పాత్ర అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ మార్పునకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ బీజేపీదే విజయమన్నారు. మార్పు కోసం కార్యకర్తలు శ్రమించి పనిచేయాలన్నారు. దీంతో 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికా రం చేజిక్కించుకోవడం సులువని ఆశాభావం వ్యక్తం చేశా రు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడు తూ, తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ అస్త్రాలను ఇప్పుడు మేం వాడుతున్నామన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో వచ్చిన ఫలితాలనే మునుగోడు ప్రజలు తిరగరాస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కుంటుం బ పాలనను బొందపెట్టే వరకు తాను నిద్రపోనని తెలిపారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగే ధర్మ యుద్ధం మునుగోడు ఉప ఎన్నికలో ప్రజల తీర్పు చారిత్రాత్మకం కానుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీలు గడ్డం వివేక్‌ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీ్‌పరావు, బంగారు శృతి, వెన్న శ్రీనివా్‌సరెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్‌రెడ్డి, పీవీ.శ్యామ్‌సుందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

Read more