టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేయాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-30T06:10:23+05:30 IST

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేయాలి : ఎమ్మెల్యే

మోతె, సెప్టెంబరు 29: టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. పార్టీకి సేవ చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కృషిచేయాలన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని వర్గాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు. అనంతరం మోతె, రావిపహాడ్‌ గ్రామాల్లో ఆసరా పింఛన్ల గుర్తింపుకార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రావిపహడ్‌లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, మునగాల సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ యాదగిరి, ఎంపీవో హరిసింగ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పొనుగోటి నర్సింహారావు, శీలం సైదులు, ఏలూరి వెంకటేశ్వరరావు, కాంపాటి వెంకన్న, మద్ది మధుసూదన్‌రెడ్డి, కొండపల్లి వెంకట్‌రెడ్డి, పాషా, సర్పంచ్‌లు వాసంశెట్టి రమేష్‌, గుండాల గంగులు, కోటేష్‌, యలమంచి మల్సూరు, కారింగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read more