తెలంగాణ పథకాలు దేశంలో అమలుచేస్తారా?

ABN , First Publish Date - 2022-10-08T06:23:44+05:30 IST

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో బీజే పీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయగలరా? అని కార్మికమంత్రి మల్లారెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌ మం డలం అరెగూడెం, కాట్రేవు, గుండ్లబాయి, సైదాబాద్‌ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని, సమస్యలు తెలుసుకున్నారు.

తెలంగాణ పథకాలు దేశంలో అమలుచేస్తారా?
అరెగూడెంలో వృద్ధులతో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 

చౌటుప్పల్‌ రూరల్‌, అక్టోబరు 7: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో బీజే పీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయగలరా? అని కార్మికమంత్రి మల్లారెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌ మం డలం అరెగూడెం, కాట్రేవు, గుండ్లబాయి, సైదాబాద్‌ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు కేసీ ఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఇం టికి పెద్దకొడుకు కేసీఆర్‌ అని కొనియాడారు. బీజేపీకి ఓటు వేస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తార ని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌రెడ్డి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతానికి ఏమి చేశా రన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో కాంట్రాక్టులు పొంది రూ.వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసం రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రం నుంచి మునుగోడు అభివృద్ధికి రూ. 100కోట్లు  మంజూరు చేయించగలరా? అని సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 20 రోజులు ఇక్కడే ఉంటానని, అన్ని సమస్యలు పరిష్కారిస్తానని చెప్పా రు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మునగాల ప్రభాకర్‌రెడ్డి, బచ్చ రామకృష్ణ, సహ ఇన్‌చార్జి,  ఫిర్జాదిగూడ మున్సిపల్‌ చైర్మన్‌ జక్కా వెంకట్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, నాయకులు నందగిరి శ్యామ్‌, జాల మల్లేషం, ఎన్నపల్లి ముత్తిరెడ్డి, కొలను అగిరెడ్డి, మునగాల మల్లారెడ్డి, దుర్గం రాజు, శాగ వెంకట్‌రెడి, నర్సింహ పాల్గొన్నారు. 


బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి 

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి అభివృద్ధి పనులపై ప్రజలు, అఽధికారులతో మాట్లాడారు. సైదాబాద్‌ నుంచి పంతంగి వరకు మంజూరైన  బీటీ రోడ్డు పనులు చేపట్టాలని గ్రామస్థులు మంత్రికి విన్నవించగా మంత్రి జగదీష్‌రెడ్డి, సంబంధిత అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పాత తేదీతో నిధులు మంజూరైనట్లు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి జగదీష్‌రెడ్డిని కోరారు.  

Read more