సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2022-12-10T01:40:12+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్‌ ఎస్‌(టీఆర్‌ఎస్‌)పార్టీకి శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు.

సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష
మునగాలలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

మునగాల, డిసెంబరు 9: ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్‌ ఎస్‌(టీఆర్‌ఎస్‌)పార్టీకి శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో చెరువుకట్ట సమీపంలో నిర్మిం చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ఆహర్నిశలూ కృషి చేస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కేసీఆర్‌ ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుంకర అజయ్‌కుమార్‌, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందిబండ సత్యనారాయణ, కోదాడ ఎంపీపీ కవితరాధారెడ్డి, మార్కెట్‌కమిటి చైర్మన్‌ బుర్ర సుధారాణి, సర్పంచ్‌ చింతకాయల ఉపేందర్‌ పాల్గొన్నారు.

ఎంపీపీతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిక

ఈ సందర్భంగా మునగాల ఎంపీపీ ఎలక బిందునరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా రేపాల గ్రామ సర్పంచ్‌ పల్లె రమణవీరారెడ్డి, వైస్‌ సర్పంచ్‌ గండు జ్యోతి ఉపేందర్‌, నారాయణగూడెం ఎంపీటీసీ మిట్టగనుపుల గురుజాతో పాటు మాధవరం, రేపాల గ్రామాల కు చెందిన పలువురు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

చిలుకూరు: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గంగమ్మ తల్లి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాల అభి వృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు, సర్పంచ్‌ కొడారు బాబు, ఎంపీటీసీ రమణ నాగయ్య, డీసీసీబీ డైరెక్టర్‌ కొండా సైదయ్య, గన్నా చంద్రశేఖర్‌, బట్టు శివాజీ, దొడ్డా సురేష్‌, అల్సకాని జనార్దన్‌, యాదవ సంఘ నాయకులు పుట్టపాక అంజయ్య, దశరథ, పుట్ట పాక పిచ్చయ్య, వెంకటి, నాగయ్య, సైదులు, నర్సింహారావు, వెంకటే శ్వర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:40:16+05:30 IST