సహకార సంఘాలను బలోపేతం చేస్తాం

ABN , First Publish Date - 2022-03-04T06:17:27+05:30 IST

రైతుల సంక్షేమం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తామని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో పీఏసీఎ్‌సల పాలకవర్గ సభ్యులకు అవగాహన సదస్సు, శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు

సహకార సంఘాలను బలోపేతం చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి 

నల్లగొండ, మార్చి 3: రైతుల సంక్షేమం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తామని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో పీఏసీఎ్‌సల పాలకవర్గ సభ్యులకు అవగాహన సదస్సు, శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంసహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 107సొసైటీలు బలోపేతం అవుతున్నాయని తెలిపారు. తమ పాలకవర్గం ఏర్పడే నాటికి 1000కోట్ల టర్నోవర్‌ ఉండగా, ప్రస్తుతం రూ.1680కోట్లకు చేరుకుందని తెలిపారు. ఉద్యోగులు, అధికారులతో పాటు పాలకవర్గాల కృషి ఎంతో ఉందన్నారు. సొసైటీలను అభివృద్ధి చేస్తే రైతులకు ఎంత ప్రయోజనం చేకూరుతుందన్నారు. పీఏసీఎ్‌సల పాలకవర్గాలు గ్రహించి అందుకు అనుగుణంగా కష్టపడాలన్నారు. రుణాల రికవరీపై పాలకవర్గాలు దృష్టిసారించాలన్నారు. దీర్ఘకాలిక రుణాలు రూ.150కోట్ల వరకు ఇవ్వగా స్వల్పకాలిక రుణాలు రూ.514కోట్లు ఇస్తున్నారు. అదేవిధంగా 650మంది విద్యార్థులకు విద్యా రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. 250 కోళ్లఫారాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంతో వారంతా ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ప్రయోజనమే ధ్యేయంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. 13వ బ్రాంచ్‌ ఏర్పాటు చేయాలంటూ కొద్ది రోజుల క్రితం ఆర్బీఐకి లేఖ రాశామని, ప్రస్తుతం రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు వెలువడకపోవడంతో మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సమావేశంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి, సీఈవో కె. మధన్‌మోహన్‌, డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, శిక్షణ తరగతుల ఉపాధ్యాయులు నర్సింహారావు, నర్సిరెడ్డి, నాబార్డు డీఎం వినయ్‌, డీసీసీబీ జీఎం వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Read more