ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2022-11-24T00:03:47+05:30 IST

ప్రభుత్వరంగ సం స్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌

కోదాడ రూరల్‌, నవంబరు 23: ప్రభుత్వరంగ సం స్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. పట్టణం లోని వర్తక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన సీఐటీయూ జిల్లా 3వ మహాసభలో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం 64కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిందని తెలిపారు. కేంద్ర ప్రభు త్వం నుంచి సహకారం లేకపోయినా 19కంపెనీలు నష్టాల ను అధిగమించి లాభాలతో నడుస్తున్నాయని ప్రభుత్వ రం గ సంస్థల సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 73షెడ్యూల్‌ పరిశ్రమల కార్మికుల కనీస వేత నాల జీవోలను సవరించనందున కార్మికులు కోట్లాది రూపాయ లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కరోనా లాక్‌డౌన్‌ ఫలితంగా కార్మికుల జీవన పరిస్థితులు మరింత దారుణమయ్యాయన్నారు. దీని ప్రభావం అసం ఘటితరంగ కార్మికులపై అధికంగా పడిందన్నారు. మహాసభలో రెండు సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాల నిర్మాణం, అన్ని విషయాలపై చర్చించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ రెండు సంవత్సరాల్లో కార్మికవర్గం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. ఈ మహాసభలో సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి వెంక టనారాయణ, కోశాధికారి రాంబాబు, నాయకులు సోమ య్య, ఏకలక్ష్మి, రాధాకృష్ణ, ముత్యాలు, షేక్‌ యాకూబ్‌, సైదులు, కృష్ణ, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:03:47+05:30 IST

Read more