ప్రజా పోరాటాలను కొనసాగిస్తాం

ABN , First Publish Date - 2022-07-05T05:55:27+05:30 IST

అక్రమ అరెస్టులతో ప్రజాపోరాటాలను ఆపలేరని, వాటిని అధిగమించి పోరాటాలను కొనసాగిస్తామని భారత కార్మిక సంఘాల

ప్రజా పోరాటాలను కొనసాగిస్తాం

గరిడేపల్లి / నూతనకల్‌, జూలై 4 : అక్రమ అరెస్టులతో ప్రజాపోరాటాలను ఆపలేరని, వాటిని అధిగమించి పోరాటాలను కొనసాగిస్తామని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కామళ్ల నవీన్‌ అన్నారు. మండలంలోని వెలిదండ గ్రామంలో సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన ఏవి ధంగా ఉన్నాయో పోలీసుల చర్యలతో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్‌ నాయకులు ఆదూరి కోటయ్య, వీసాల వెంకటేశ్వర్లు, ఆదూరి శ్రీను, వల్లపుదాసు రాజు, అలవాల వెంకన్న పాల్గొన్నారు. నూతనకల్‌లో ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్తున్న సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో నాయకులు పెద్దింటి రంగారెడ్డి, సుంకిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, అశోక్‌, మధు ఉన్నారు. 


Read more