ఒకే దఫా రుణాలను మాఫీ చేస్తాం

ABN , First Publish Date - 2022-06-11T06:36:14+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రైతులకు ఒకే దఫా రూ.2లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు.

ఒకే దఫా రుణాలను మాఫీ చేస్తాం
కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుతున్న పటేల్‌ రమేష్‌రెడ్డి

సూర్యాపేట రూరల్‌, సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 10:కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే  రైతులకు ఒకే దఫా రూ.2లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కుప్పిరెడ్డిగూడెం, కేటీఅన్నారం గ్రామాల్లో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో, సూర్యాపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అనంతరం రైతు డిక్లరేషన్‌ను ఇంటింటికీ వివరిస్తూ గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట మండలం నుంచి వివిధ పార్టీల కార్యకర్తలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్‌, షఫీవుల్లా, వెంకన్న పాల్గొన్నారుRead more