ఏకగ్రీవ నజరానాల కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2022-09-11T06:29:22+05:30 IST

ఏకగ్రీ వ పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరా నా కోసం నిరీక్షిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి మూడేళ్లు గడిచినా నేటికీ వాటికి ప్రోత్సాహకాన్ని విడుదల కాలే దు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవమైతే మేజర్‌ పంచాయతీలకు రూ.15లక్షలు, తండాలకు రూ.10లక్ష లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఏకగ్రీవ నజరానాల కోసం నిరీక్షణ
ఏకగ్రీవ పంచాయతీ వేల్పుచర్ల గ్రామ కార్యాలయం

జిల్లాలో 48 ఏకగ్రీవ పంచాయతీలు

మూడేళ్లు గడిచినా అందని ప్రోత్సాహం


సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 10: ఏకగ్రీవ పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరా నా కోసం నిరీక్షిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి మూడేళ్లు గడిచినా నేటికీ వాటికి ప్రోత్సాహకాన్ని విడుదల కాలే దు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవమైతే మేజర్‌ పంచాయతీలకు రూ.15లక్షలు, తండాలకు రూ.10లక్ష లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇవేగాక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఏకగ్రీ వ పంచాయతీకి రూ.5లక్షలు అందజేస్తామని ప్రకటించింది. జిల్లాలో మొత్తం 475 పంచాయతీలు ఉన్నాయి. వీటికి జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత ఎన్నికల్లో 12 పంచాయతీలు, రెండో విడత ఎన్నికల్లో 27, మూడో విడత ఎన్నికల్లో 9 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలో మొత్తం 48 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, వాటికి ప్రోత్సాహక నిధులు అందజేయాల్సి ఉంది.


పరిష్కారం కాని సమస్యలు

14వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా నిధు లు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. దీంతో చిన్న పంచాయతీల కు పెద్దగా నిధులు రావడంలేదు. వీధి దీపాలు, విద్యుత్‌ బిల్లులు కూ డా చెల్లించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీలతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారు. అయితే నేటికీ నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాలు అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు. నూతన పంచాయతీలకు సొంత భవనాలు కూడా లేవు. అరకొర వసతుల నడుమ అద్దె భవనాల్లో పాలన సాగిస్తున్నాయి.


ప్రోత్సాహకం అందితే తండాల అభివృద్ధి

పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేసింది. అయితే తక్కువ జనాభా ఉన్న తండాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. తండాల్లో జనాభా 500 నుంచి 600లోపు మాత్రమే ఉంది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తే తండాలకు కేవలం రూ.50వేలు మాత్రమే సమకూరుతాయి. ఏకగ్రీవ తండాలకు ప్రభుత్వం అందించే రూ.10లక్షల సాయంతో కొంత వరకు అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వ తలసరి గ్రాంటు కింద పంచాయతీ అభివృద్ధికి కేవలం రూ.4వేలు మాత్రమే ఇస్తోంది. జనాభా ప్రాతిపదికన సగటున ఒక్కో పంచాయతీకి రూ.20వేలకు మించి ఆదాయం రావడం లేదు. 100 నుంచి 150 ఇళ్లు మాత్రమే ఉండడంతో పన్నుల పరంగా వచ్చే ఆదాయం కూడా అంతంతే. ఈ నిధులతో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. సీనరేజీ, ఆర్థిక సంఘం నిధుల మంజూరు కూడా అంతంత మాత్రం కావడంతో తండాల్లో అభివృద్ధి పనులు లేవు.


వేతనాలు ఎలా?

ప్రభుత్వం సర్పంచ్‌కు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. తండాలకు నిధులు అంతకంటే తక్కువ వస్తున్నాయి. ఏటా సర్పంచ్‌ వేతనమే రూ.60వేల దాకా ఉంటే, పంచాయతీ ఆదాయం రూ.60వేల లోపు ఉండడం గమనార్హం. ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి కార్యదర్శిని నియమించింది. కార్యదర్శులకు ప్రభుత్వమే వేతనం ఇస్తోంది. వీటిన్నింటితో పంచాయతీలు ప్రభుత్వానికి భారంగా మారాయి. ఇప్పటికైనా సర్పంచ్‌లు ఆదాయ వనరులు సమకూర్చుకుంటే తప్ప గ్రామాభివృద్ధి ఉండదు.


నిధులు మంజూరైతే మరింత అభివృద్ధి : ఖమ్మంపాటి కర్ణాకర్‌, వేల్పుచర్ల సర్పంచ్‌, అర్వపల్లి మండలం

ఏకగ్రీవ నజరానా మంజూరైతే పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సాధారణంగా వచ్చే నిధులకు తోడు ప్రోత్సాహకం వస్తే గ్రామంలో సమస్యల పరిష్కారానికి వెసులు కలుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం త్వరగా స్పందించి నిధులను మంజూరు చేస్తే ఏకగ్రీవ పంచాయతీలు అభివృద్ధిలో ముందుంటాయి.


ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది : యాదయ్య, డీపీవో

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఏకగ్రీవ నజరానా మంజూరైతే ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఏకగ్రీవ పంచాయతీలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించాం.


Updated Date - 2022-09-11T06:29:22+05:30 IST