వీఆర్వోలు వెంటనే రిపోర్ట్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-08-02T05:07:24+05:30 IST

వీఆర్వోలు వారికి కేటాయించిన శాఖ ల అధికారులకు వెంటనే రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు.

వీఆర్వోలు వెంటనే రిపోర్ట్‌ చేయాలి
కలెక్టరేట్‌లో లాటరీ తీసి వీఆర్వోలకు శాఖలు కేటాయిస్తున్న కలెక్టర్‌

లాటరీ విధానంలో వీఆర్‌వోలకు శాఖల కేటాయింపు

భువనగిరి రూరల్‌, ఆగస్టు 1: వీఆర్వోలు వారికి కేటాయించిన శాఖ ల అధికారులకు వెంటనే రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. జిల్లాలోని 17మండలాల్లో పనిచేస్తున్న 161మంది వీఆర్వోలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కలెక్టరేట్‌లో సోమవారం లాటరీ తీసి శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా అధికారులు, రెవె న్యూ సిబ్బంది, వీఆర్వోల సంఘం, టీఎన్జీవో అసోసియేషన్‌ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా వీడియోరికార్ట్‌ చేయించామన్నారు. అనంతరం వీఆర్వోలను 32శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డర్లు పొందిన వారు వెంటనే సంబంధిత శాఖల అధికారులకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, చౌటుప్పల్‌ ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో ఎం.నాగేశ్వరచారి, తహసీల్దార్ల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధి పి.శ్యాంసుందర్‌రెడ్డి, టీజీవో, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, సి.జగన్‌, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డి.భగత్‌ తదితరులున్నారు.

ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం

ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఓటరు కార్డుతో ఆధార్‌ నంబర్‌ అనుసంధానం ప్రక్రియను కలెక్టర్‌ పమేలాసత్పథి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాలన్నారు. ఫాం-6బీ ద్వారా ఓటరు వారి ఆధార్‌ నంబర్‌ లేదా ఇతర 11రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైన ఒకటి బూత్‌ లెవల్‌ అధికారి సమర్పించి, లేదా మీ సేవ కేంద్రాల ద్వారా అనుసంధానం చేసుకోవచ్చన్నా రు. సమావేశంలో అధికారులతోపాటు పలు పార్టీల ప్రతినిధులు బట్టు రామచంద్రయ్య, అశోక్‌, ఎండి.అథహర్‌, శ్రీనివా్‌సరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2022-08-02T05:07:24+05:30 IST